సభలను అడ్డుకునే తీరతాం: భాజపా

ఢిల్లీ: పార్లమెంట్‌ సమావేశాలను అడ్డుకుని తీరతామని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. ప్రధాని రాజీనామాపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని  తేల్చిచెప్పింది. కేవలం బొగ్గు కుంభకోణం గురించి తాము ప్రధాని రాజీనామా కోరడం లేదని, వరసగా వెలుగులోకి వచ్చిన 2 జీ, ఆదర్శ్‌ లాంటి పలు కుంభకోణాల నేపథ్యంలో తామే డిమాండ్‌ చేస్తున్నామని  భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు అన్నరు. యూపీఏ ప్రభుత్వం ప్రజలకు భారంగా తయారయ్యిందని, ఒక్క ప్రధాని రాజీనామానే కాదు, మొత్తం మంత్రివర్గం రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ వ్యక్తం చేశారు. ప్రధాని నేతృత్వంలో ప్రభుత్వం ఆర్థిక, వ్యవసాయ రంగాల్లోను, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలోను విఫలమైందని ఆయన  దుయ్యబట్టాడు.