సమస్యలు పట్టిపీడిస్తుంటే సీఎం ఆటలాడుతున్నారు: తెదేపా

కడప: రాష్ట్రంలో సమస్యలు పట్టిపీడిస్తుంటే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆటలు ఆడుకుంటూ ఆనందంలో మునిగి తేలుతున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. సోనియాగాంధీ లాటరీ పద్దతిలో ముఖ్యమంత్రులను రాష్ట్రానికి నియమిస్తున్నారే తప్ప ప్రజల గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విద్యుత్‌ సమస్యలపై మూడు రోజలుగా కడప కలెక్టరేట్‌ వద్ద నిరవదిక నిరాహరదీక్ష చేస్తున్న నలుగురు దేశం నాయకులు రేవంత్‌రెడ్డి పరామర్శించారు.