సమిష్టి కృషితోనే విజయం
యైటీంక్లయిన్ కాలనీ ఏఫ్రిల్ 01 (జనంసాక్షి):
సమిష్టి కృషితోనే విజయాలు సాధ్యమని మందమర్రి జనరల్ మేనేజర్ జి. మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం యైటీంక్లెయిన్ కాలనీలోని ఓసిపి త్రీ ప్రాజెక్ట్ అధికారి కార్యాలయంలో మైనింగ్ సిబ్బందిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రతి ఉద్యోగి రక్షణతో కూడిన ఉత్పత్తి సాధనకు కష్టించి పనిచేయాలని కోరారు. ఉత్పత్తి లక్ష్యాలు సాధించినప్పుడే సంక్షేమ చర్యలు వేగంగా అమలు చేయగలుగుతామని వెల్లడించారు. పదోన్నతి పై వెళుతున్న మోహన్ రెడ్డిని మైనింగ్ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ స్టాఫ్ అసోసియేషన్ నాయకులు మాదాసు రామమూర్తి, దొంగరి శ్రీనివాస్, చల్ల రవీందర్ రెడ్డి, మోహన్ రెడ్డి, ప్రసన్న కుమార్, అజయ్, రమేష్ బాబు, రాజారాం, జావీద్ తదితరులు పాల్గొన్నారు