సమైక్యవాదుల సద్దులు మోసిన రేవంత్ గోడ మీది పిల్లి….. కవ్వం పల్లి …. కవ్వంపల్లి సర్పంచ్ గా గెలిస్తే…ఎమ్మెల్యేగా పోటీ చేయను రసమయి బహిరంగ సవాలు
జనం లేక పాదయాత్ర పల్చబడింది
పోలంపల్లి లో గోదావరి నీళ్లు కనిపించలేదా….?
మీడియా సమావేశంలో నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే రసమయి .
మానకొండూరు, ఆర్ సి, మార్చి 4 (జనం సాక్షి)
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో సమైక్యవాదుల బూట్లు నాకిన రవ్వంత రెడ్డి, కామన్ సెన్స్ లేని కవ్వంపల్లి లాంటి చిల్లర మల్లర గాళ్ల మాటలను ప్రజలు ఏనాటికి నమ్మరని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు . సమైక్యవాదుల సద్దులు మోసిన రవ్వంత రెడ్డి, ఐదువందల రూపాయల వైద్యానికి 50 వేల రూపాయలు వసూలు చేసిన కవ్వంపల్లికి కరీంనగర్, హైదరాబాద్ లో ఆస్తులు, అంతస్తులు ఎక్కడివని ప్రశ్నించారు రసమయి బాలకిషన్. చిల్లర గాళ్ల గురించి మాట్లాడే అవసరం తనకు లేదన్నారు. రవ్వంత రెడ్డి, కామంపల్లి అని రేవంత్ రెడ్డిని, కవ్వంపల్లి సత్యనారాయణ ను పరోక్షంగా ఎద్దేవ చేశారు. శుక్రవారం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ లు హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా మానకొండూరు నియోజకవర్గం లో నిర్వహించిన సభలో చేసిన వ్యాఖ్యలపై రసమయి నిప్పులు చెరిగారు. మూడు అడుగుల వ్యక్తి రసమయి అని సంబోధించడం పై ఆయన తీవ్ర అభ్యంతర వ్యక్తం చేశారు. పగటివేషగాళ్లు ఎన్ని అడుగులు ఉన్నారో అని సూటిగా ప్రశ్నించారు. పిట్టల దొరల గురించిమాట్లాడే అవసరం తనకు లేదని, మేధావుల మౌనం సమాజానికి హితం కాదని, సంస్కారం లేని వాళ్లే అలాంటి మాటలు మాట్లాడతారని పరోక్షంగా దెప్పి పొడిచారు. ఇలాంటి కొత్త వేషగాళ్లు ,పగటి బిచ్చగాళ్లు ఎంత మంది వచ్చినా రసమయి స్థానం చెక్కుచెదరని నొక్కి వక్కాణించారు. కాంగ్రెస్ పార్టీ కథ ముగిసినట్లేనని అరిగిపోయిన రికార్డులను ఎన్నిసార్లు వినిపిస్తారన్నారు . శనివారం మానకొండూరులో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మానకొండూరులో జరిగిన సభ జనం లేక పలుచబడిందా, మొగిలిపాలెం ముఖం చూశారా, పోలంపల్లి లో గోదావరి నీళ్లు కనిపించాయా అని సూటిగా కాంగ్రెస్ నాయకులను మీడియా సాక్షిగా నిలదీశారు. ప్రజల గుండెల్లో రసమయి స్థానం చెక్కుచెదరని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు సరికావని, అవగాహన లేమితో అసంధర్భ ప్రేలాపనలను మానుకోవాలని ఆయన హితువు పలికారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు ,రసమయిలను దూషించడానికే కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహించటం వారి దౌర్భాగ్య పరిస్థితికి నిదర్శనం అని తేల్చి చెప్పారు. కవ్వంపల్లి సర్పంచ్ గా గెలిస్తే తాను మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయనని మీడియా సాక్షిగా సవాలు విసిరారు ఎమ్మెల్యే రసమయి. బందోబస్తు కోసం పోలీసులు ఎంతమంది వచ్చారో, అంతకన్నా తక్కువ స్థాయిలో సభకు జనం హజరైనారని ఎద్దేవా చేశారు. మానకొండూరు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించామని, కుల సంఘాలకు, మహిళ సంఘాలకు పక్కా భవనాలు, గ్రామాల్లో సీసీ రోడ్లు, వైకుంఠధామాలు, తదితర అభివృద్ధి పనులు కాంగ్రెస్ వాళ్లకు కనిపించవన్నారు. మానకొండూరు నియోజకవర్గం లో 50 వేలకు పైగా మెజార్టీతో రెండు సార్లు గెలిపించిన ప్రజల సేవకు సదా కంకణ బద్ధుడనై ఉంటానని చెప్పారు. సహనం మీరితే సవాలు జవాబు, మరో విధంగా ఉంటుందని హెచ్చరించారు. దళిత జాతికి పట్టిన పెద్ద పీడ కవ్వంపల్లి కనీసం దళిత జాతి గౌరవ నిలపలేని దౌర్భాగ్యుడని ఆరోపించారు. ఎంత జనాభా ఉంటే వంద పడకల ఆసుపత్రి మంజూరు అవుతుందో తెలియని, కనీస పరిజ్ఞానం లేని కవ్వంపల్లి వైద్యుడు ఎలా అయ్యాడో, ఇంకా రాజకీయాలు ఎందుకో ఆలోచించుకోవాలని హితువు పలికారు. వ్యక్తిగత దూషణలే రాజకీయ పరిమితి అనుకుంటే వారి కు సంస్కారానికి వారికే వదిలేస్తున్నానని స్పష్టం చేశారు. గెలవటం మాట అటుంచి కనీసం డిపాజిట్ దక్కించుకునే మార్గాలు కవ్వంపల్లి వెతుక్కోవాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తక్షణం వ్యాఖ్యలు ఉపసంహరించుకుని భే షరతుగా క్షమాపణలు చెప్పాలని రసమయి బాలకిషన్ మీడియా సాక్షిగా డిమాండ్ చేశారు. జిల్లా ప్రాదేశిక సభ్యులు, మానకొండూరు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, సర్పంచులు రామచగోపాల్ రెడ్డి, దేవా సతీష్ రెడ్డి, నాయకులు శాతరాజు యాదగిరి, పిట్టల మధు, నెల్లి మురళి, అడప శ్రీనివాస్, కడారి ప్రభాకర్, బొల్లం శ్రీనివాస్, నెల్లి శంకర్, గుర్రం కిరణ్ గౌడ్, దండ బోయిన శేఖర్, పిండి సందీప్, తిమ్మాపూర్ మండల నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు ఈ మీడియా సమావేశానికి రసమయితోపాటు హజరయ్యారు.