సర్పంచిని సన్మానించిన. ఐఏఎస్ ఆఫీసర్
బచ్చన్నపేట సెప్టెంబర్ 29 (జనం సాక్షి) జనగామ జిల్లా. బచ్చన్నపేట మండలం కేశపురం గ్రామానికి చెందిన గిద్దెల రమేష్ . మధ్యకాలంలో కురిసినటువంటి వర్షాల వల్ల ఆలేరు కొలనుపాక మధ్యలో ఉన్నటువంటి వాగు ఉదృతంగా ప్రవహిస్తుండగా మోటార్ సైకిల్ పై ఉపాధ్యాయురాలు ఆ వాగులో ప్రమాదవశాత్తు కొట్టుకుపోతుండగా గమనించిన సర్పంచ్ ఆమెను ప్రాణాలకు తెగించి సాహసం చేసి కాపాడినందుకు సర్పంచి ధైర్య సాహసాలకు మెచ్చుకొని ఈరోజు వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓబుల్ కేశపూర్ గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి బుర్ర వెంకటేశం గౌడ్ ఐఏఎస్. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి. మరియు వాస్విక్ ఫౌండేషన్ చైర్మన్ నిడిగొండ నరేష్ కుమార్ సర్పంచ్ రమేష్ కు శాలువాతో సన్మానించి జ్ఞాపకం అందించి అభినందనలు తెలిపారు. నిదిగొండ శ్రీనివాసు గ్రామస్తులు ఉన్నారు