సర్పంచ్ కార్యదర్శి లను సన్మానించిన ఎమ్మెల్యే మదన్ న్ రెడ్డి..

..సర్పంచ్ కార్యదర్శి లను సన్మానించిన ఎమ్మెల్యే మదన్ న్ రెడ్డి….
చిలప్ చేడ్/మర్చి/జనంసాక్షి  :- చిలప్ చేడ్ మండల సర్పంచ్ లను ఘనంగా సన్మానించిన నర్సాపూర్ శాసనసభ్యులు చిలుముల మదన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 19 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సర్పంచ్,ఎంపిటిసి, పంచాయతీ కార్యదర్శిలను, సన్మానించడం చాలా సంతోషకరంగా ఉందని ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు అలాగే గ్రామ పంచాయతీలకు పల్లె ప్రగతి కార్యక్రమం రాకముందు చాలా ఇబ్బందులు ఉండేవని పల్లె ప్రగతి కార్యక్రమం యావత్ భారతదేశంలోని దిక్సూచిగా నిలిచిందని పల్లె ప్రగతి ద్వారా గ్రామాలకు దశ దిశ అనే ఒక పద్ధతిలొ పారిశుద్ధ్యం శుభ్రమయ్యాయి ముఖ్యమంత్రి ఆలోచన మేరకు తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కోతల నిర్మూలన  ప్రతి నెల నెల పింఛన్లు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ రైతుబంధు రైతు బీమా గ్రామాలలో రోడ్ల అభివృద్ధి చేపట్టడం జరుగుతుంది కనుక ప్రజలందరినీ భాగస్వాములను చేసి నాయకులు ముందుండాలని మండలంలో తొమ్మిది టీంలను ఏర్పాటు చేసి ఏ గ్రామంలో పారిశుద్ధ్యం నిర్మూలన అభివృద్ధి కార్యక్రమాలతో ముందు ఉందో సర్వే ద్వారా మొదటి మూడు వరుసలో ఉన్న గ్రామ పంచాయతీలకు బహుమతులను ఇవ్వడం జరుగుతుందన్నారు గ్రామాలలో ఇప్పటివరకు  సర్పంచులు నాయకులు ముందుండి నిర్వహించుకున్నటువంటి పనుల పెండింగ్ బిల్లులను ఈ నెలాఖరులోగా చెల్లిస్తామని ఆర్థిక మంత్రి కేటీఆర్ గారు సలహా ఇవ్వడం జరిగిందని త్వరలోనే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ వినోద దుర్గా రెడ్డి జడ్పి కోఆప్షన్ సభ్యులు మన్సూర్ వైస్ ఎంపీపీ విశ్వమర స్వామి ఎంపీడీవో శశి ప్రభ ఆత్మ చైర్మన్ వెంకట్ రెడ్డి ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు సుభాష్ రెడ్డి సర్పంచుల ఫోరం అధ్యక్షులు లక్ష్మీ దుర్గా రెడ్డి ఎంపీఓ కృష్ణమోహన్ ఏపీవో శ్యాం కుమార్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అశోక్ రెడ్డి ఎంపీటీసీలు మల్లయ్య మల్లమ్మ సొసైటీ వైస్ చైర్మన్ రామచంద్ర రెడ్డి సర్పంచులు మనోహర స్వరూప మమత కవిత పరుశురాం రెడ్డి గోపాల్ రెడ్డి రాకేష్ బిక్షపతి రమేష్ ఆయా గ్రామాల సర్పంచులు గ్రామపంచాయతీ కార్యదర్శులు ఎంపీటీసీలు పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు