సర్వే కోసం రైతుల రాస్తారోకో
బోథ్ మార్చి 31 (జనం సాక్షి) నష్టపోయిన పంట సర్వే చేపట్టాలని కోరుతూ బోథ్ మండలం కన్గుట్ట గ్రామానికి చెందిన రైతులు శుక్రవారం పొచ్చెర క్రాస్ రోడ్డు వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలతో తాము తీవ్రంగా నష్టపోయామని ఇతర ప్రాంతాల్లో అధికారులు సర్వే చేపడుతున్నప్పటికీ తమ గ్రామంలో సర్వే చేపట్టడం లేదని దీనివల్ల తాము నష్టపరిహారం పొందడంలో జాబితాలో తమ పేర్లు నమోదు కాక నష్టపోతామని వారు వాపోయారు. అధికారులు తక్షణమే స్పందించి సర్వే చేపట్టే దిశగా చర్యలు చేపట్టాలని వారి డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనను ఉదృతం చేస్తామన్నారు. రైతుల రాస్తారోకో విషయం తెలుసుకున్న ఎస్ఐ కేంద్రే రవీందర్ సంఘటన స్థలానికి చేరుకొని రైతుల సముదాయించారు.సంబదిత అధికారులతో మాట్లాడి తగు చర్యలు చేపట్టిన చూస్తారని హామీ ఇవ్వడంతో రైతుల శాంతించారు.