సహకార సంఘాలు ప్రభుత్వాల చేతిలో బందీలు

రాష్ట్ర సహకార బ్యాంకుల పట్టణ సమాఖ్య అధ్యక్షుడు రామ్మూర్తి

హైదరాబాద్‌: నిర్దిష్టమైన విధానం లేకపోవడం వేల్లే సహకార సంఘాలు ప్రభుత్వాల చేతిలో బందీలుగా మారుతున్నాయని రాష్ట్ర సహకార బ్యాంకుల  పట్టణ సమాఖ్య అధ్యక్షుడు రామ్మూర్తి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌ సహకార బ్యాంకుల దశాబ్ది ఉత్సవాలు హైదరాబాదులో ప్రారంభమయ్యాయి. వ్యవసాయం, ఆర్థిక రంగాల్లో సహకార బ్యాంకుల పాత్రపై సదస్సులు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 97వ రాజ్యాంగ సవరణ ఈ రంగానికి వూతమిస్తుందని అఖాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు సహకార సంఘాలని రాజకీయ ఉపాధి మార్గంగా మార్చేశాయని సరైన విధానం లేకపోవడం వల్లే ఈ రంగం నిర్వీర్యమయ్యే ప్రమాదంలో పడిందన్నారు.  నిర్దిష్ట విధానాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు.