సాగర్ జలాలను సకాలంలో వదలండి – అధికారులను హెచ్చరించిన – సండ్ర

 

+నీటి విడుదలలో అలసత్వం వహిస్తే ఊరుకునేది లేదు

 

పెనుబల్లి, మార్చ్ 11(జనం సాక్షి) సాగర్ జలాలను సక్రమంగా, సకాలంలో విడుదల చేసి పంటలు ఎండ కుండా చూడాలని సత్తుపల్లి ఎం ఎల్ ఎ సండ్ర వెంకటవీరయ్య ఎన్ ఎస్ పి అధికారులను హెచ్చరించారు,
ఖమ్మం జిల్లా తల్లాడ,కల్లూరు,పెనుబల్లి మండలాల పరిధిలో సాగర్ ఆయకట్ట రైతులకు సాగర్ జలాలు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి రావటంతో సండ్ర శనివారం రైతులతో కలిసి ఎండిన పంటలను పరిశీలిం చారు,అనంతరం కల్లూరు ఎన్ఎస్పి నీటిపారుదల శాఖ అధికారులను కలిశారు,ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ నాగార్జునసాగర్ లో పూర్తిస్థాయిలో నీళ్లు ఉన్నాయని,ఒక్క ఎకరం కూడా పంట ఎండకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినప్పటికీ,కాలువ నిర్వహణకు కావాల్సిన నిధులు ఇస్తున్నప్పటికీ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని కొంతమంది అధికారులు నీటి పంపిణీ విషయంలో సమన్వయ లోపంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని, అధికారుల తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు,
ఎండాకాలంలో షట్టర్లు చూడాల్సిన అవసరం ఉన్నప్పటికీ అవి చూడకుండా అధికారులు అందరూ కార్యాలయాలలోనే కూర్చోవడం కరెక్ట్ కాదన్నారు.
నాగార్జునసాగర్ ఆయకట్టు కింద రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని అన్నారు, నల్గొండ,ఖమ్మం జిల్లాలోని ఇరిగేషన్ శాఖ లోని అధికారుల సమన్వయలోపంతో ఈ పరిస్థితి తలెత్తిందన్నారు.రెండవ పంటలో లక్షకు పైగా ఎకరాలకు సాగునీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎండిన పొలాలను చూపించి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.ఈ సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించాలని లేకపోతే రైతుల నుండి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని అధికారులను హెచ్చారించారు, అలానే ఇరిగేషన్ అధికారులు వరికోతలు అయ్యే వరకు హెడ్ క్వార్టర్ లోనే ఉండేలా చూడాలని ఫోన్ ద్వారా కలెక్టర్ ను కోరారు ,ఈ కార్యక్రమం లో పెనుబల్లి బి ఆరె ఎస్ నాయకులు కనగాల వెంకట్రావ్,పసుమర్తి వెంకటేశ్వరరావు, కోటగిరి సుధాకర్ బాబు, కొప్పుల గోవిందా రావు, తదితర నాయకులు రైతులు పాల్గోన్నారు.