సామాజిక ఆసుపత్రుల్లో పెరుగిన ప్రసవాల సంఖ్య
మెట్‌పల్లి,(జనంసాక్షి): సామాజిక ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతోందని డీసీహెచ్‌వో బోజ అన్నారు. గురువారం ఆయన మెట్‌పల్లి సామాజిక ఆసుపత్రిని తనిఖీ చేసి, మరమ్మతు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఈ నెలలో జిల్లాలోని ఏడు ఆసుపత్రుల్లో ఇప్పటివరకు 447 ప్రసవాలు జరిగాయన్నారు. గత నెలలో 1055 కాన్పులు చేయగా, అందులో 358 సుఖ ప్రసవాలున్నాయన్నారు.ఆసుపత్రుల్లో ఖాళీ స్థానాలను మూడో పార్టీ ద్వారా భర్తీ చేస్తున్నామని, ప్రైవేటు వైద్యుల సేవలు వినియోగించుకొంటున్నామన్నారు. ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు ప్రసవాలన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగేలా చూడాలన్నారు.డీసీహెచ్‌వో వెంట ఆసుపత్రి సూపరింటెడెంట్ అమరేశ్వర్, ఇతర వైద్యులు, సిబ్బంది ఉన్నారు.