సింగరేణిలో తవ్వకాలు జరిపితే 60 ఏళ్లలో బొగ్గు కనుమరుగు

న్యూఢిల్లీ: మరో 60 ఏళ్లలో సింగరేణి బొగ్గు కనుమరుగవుతుందని కేంద్ర బొగ్గుశాఖ మంత్రి శ్రీ ప్రకాశ్‌ చెప్పారు. సిగరేణిలో ప్రస్తుతం 52 మిలియన్‌ టన్నులస్థాయిలో ఉత్పత్తి జరుగుతున్నట్లు తెలిపారు. ఇదే స్థాయిలో తవ్వకాలు జరిపితే 60 ఏళ్లలో అక్కడ బొగ్గు కనుమరుగవుతుందన్నారు. 12వ పంచవర్ష ప్రణాళిక (2012-17) కాలంలో సింగరేణి గనుల పరీవాహక ప్రాంతంలో 6.5 లక్షల మీటర్లు కొత్త బ్లాకుల డ్రిల్లింగ్‌ను ప్రాంతీయ అన్యేషణ కార్యక్రమం కింద జియలాజికల్‌ సర్వే ఆఫ& ఇండియా ఆధ్వయర్యంలో చేపడతాం. ప్రోత్సాహక అన్వేషణ పథకం కింద మరో 80 వేల మీటర్ల డ్రిల్లింగ్‌ను బొగ్గుశాఖ చేపడుతుంది.