సిని నటుడు సుమన్ ను మర్యాద పూర్వకంగా కలిసిన నాయకులు
శామీర్ పేట్, జనం సాక్షి :శుక్రవారం తెలంగాణ భవన్ లో కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ సినీనటుడు సుమన్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ విలేకరులతో మాట్లాడుతు.. సినీ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన సుమన్ బిఆర్ఎస్ లో కీలక భూమిక పోషించాలని అభిలాషించారు. సుమన్ ను కలసిన వారి లో అఫ్జల్ ఖాన్ తో పాటు కేసిఆర్ సేవాదళం మేడ్చల్ జిల్లా కార్యదర్శులు బత్తుల శశికాంత్ యాదవ్, మహ్మద్ గౌస్ లు ఉన్నారు.
3ఎస్పీటీ -1: సినినటుడు సుమన్ ను కల్సిన నాయకులు