సిపిఆర్ పై అవగాహన సదస్సు సిపిఆర్ పై అవగాహన సదస్సు
రామకృష్ణా పూర్, (జనంసాక్షి): క్యాతన్ పల్లిమున్సిపాలిటీ రెండో వార్డు జోడుపప్పుల ఏరియాలో వార్డు కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్ ఆధ్వర్యంలో సిపిఆర్ పై అవగాహన సదస్సు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మందమర్రి దీపక్ నగర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ మానస హాజరై ప్రజలకు సి పి ఆర్ ఫై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ మానస మాట్లాడుతూ ఈ మధ్య చాలామంది గుండె నొప్పి వచ్చి చనిపోతున్నారని, నొప్పి వచ్చిన సమయంలో ప్రధమ చికిత్స చేస్తే బ్రతికే అవకాశం ఉందని తెలిపారు. ఎవరైనా ఉన్నట్టుండి సృహ లేకుండా పడిపోయినట్లయితే వారికి ఏం జరిగిందో పరిశీలించి వెంటనే డాక్టర్ వద్దకు తీసుకెళ్లాలని కోరారు. గుండె నొప్పి అని మనం గమనించినట్లయితే వారికి తగు ప్రథమ చికిత్స చేయాలని అది ఎలా చేయాలో ప్రజలకు అర్థమయ్యే విధంగా డాక్టర్ మానస చేసి చూపించారు. అనంతరం వార్డు కౌన్సిలర్ పుల్లూరు సుధాకర్ మాట్లాడుతూ పిలవగానే డాక్టర్ వచ్చేసి ప్రజలకు సిపిఆర్ పై , ఆరోగ్య విషయంపై పలు సూచనలు సలహాలు చేయడం ప్రజలకు సులువుగా అర్థమయ్యే విధంగా తెలియజేయడం జరిగిందని తెలిపారు. ఆరోగ్యంగా ఉండాలంటే డాక్టర్లు చెప్పిన విధంగా సలహాలు సూచనలు పాటిస్తూ దీర్ఘకాలిక రోగాలు ఏమైనా ఉంటే, తగువిధంగా మందులు వాడుతూ డాక్టర్ల సలహా పై వాకింగ్ లాంటి వ్యాయామాలు చేసుకోవాలని, చుట్టుపక్క పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఆరోగ్యకరమైన ఆహారం తినాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆశ కార్యకర్త వెంకటలక్ష్మి, మాజీ ఎంపిటిసి కళ్యాణ్, బి ఆర్ ఎస్ నాయకులు వెంకటేష్,సతీష్,రవి, పాష ,లక్ష్మణ్,గణపతి,చంద్రయ్య,బాలాజీ, ఎల్లయ్య, వార్డులోని మహిళలు తదితరులు పాల్గొన్నారు.