సిపిఐ మహాసభలను విజయవంతం చేయండి

ఆదిలాబాద్‌, జూన్‌ 15 : ఈ నెల 17,18 తేదీల్లో జిల్లాలోని బెల్లపల్లి పట్టణంలో జరిగే పార్టీ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సిపిఐ శాసనసభ పక్ష నేత జి.మల్లేశ్‌ పిలుపు ఇచ్చారు. ఈ సభల్లో జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి, సిపిఐ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను వదిలి అవినీతి అక్రమాల్లో కూరుకుపోయారని ఆయన ఆరోపించారు. ఈ ప్రభుత్వాలను గద్దె దించాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల అన్ని వర్గాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని ఆయన విమర్శించారు. ప్రజల సమస్యలను, ప్రజా సంక్షేమాన్ని విస్మరించి అధికార పక్షంలో ఉన్న మంత్రులు, అధికారులు లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలను చైతన్య పరిచి ప్రభుత్వాలకు బుద్ధి చెబుతామని ఆయన పేర్కొన్నారు.