సిపి చేతుల మీదుగా ప్రశంస పత్రాల అందుకున్న మంథని రామగిరి ఎస్సైలు
జనం సాక్షి , మంథని : రామగుండం కమిషనరేట్ పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్ లకు సంబంధించి శుక్రవారం ఎన్టిపిసి మిలీనియం హాల్లో బెస్ట్ వర్టికల్ ఫంక్షనీంగ్ జనవరి నెలకు సంబంధించి రివార్డు మేళ రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ రెమ రాజేశ్వరి ఐపీఎస్.ఐ.జి) నిర్వహించారు. ఇందులో భాగంగా మంథని, రామగిరి పోలీస్ స్టేషన్ ల నుంచి ఉత్తమ స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఫంక్షనల్ వర్టికల్ విభాగంలో మంథని ఎస్సై వెంకటేశ్వర్, రామగిరి ఎస్సై కటికే రవి ప్రసాద్ ఎంపికై, రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ రెమ రాజేశ్వరి చేతుల మీదుగా మంథని ఎస్సై అప్పని వెంకటేశ్వర్, రామగిరి ఎస్సై కటికే రవి ప్రసాద్ లు ప్రశంస పత్రం అందుకున్నారు.