సిమెంట్‌ ధరలపై తెదేపా నేతలు ముఖ్మమంత్రికి ఫిర్యాదు

హైదరాబాద్‌: కడప జిల్లాలోని వైఎస్‌ జగన్‌కు చెందిన భారతి సిమెంట్‌తో పాటు దాల్మియా, ఇండియా, జువారీ సిమెంట్‌ల పరిశ్రలు ఉద్దేశపూర్వకంగానే కృత్రిమ కొరత సృష్టించి ఇష్టానుసారంగా ధరలు పెంచుతున్నాయని ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సిమెంట్‌ పరిశ్రమ ప్రతినిధులు అధికారులతో కలసి ధరల నియంత్రణకు త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటుకు కిరణ్‌ అంగీకరించారని చెప్పారు. తక్షణమే సిమెంట్‌ ధరలు తగ్గించకపోతే ఉత్పత్తి అడ్డుకుంటామని నేతలు హెచ్చరించారు.