సిరియాలో హింసను ఆపేందుకు చర్యలు చేపట్టాలి: హిల్లరీ క్లింటన్
వాషింగ్టన్: సిరియాలో జరుగుతున్న మారణకాండపై అమెరికా విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్ స్పందించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వెంటనే చర్యలు చేపట్టి సిరియాలో హింసను ఆపాలని కోరారు. మారణహోమం జరుగుతున్న ప్రాంతాల్లో వెంటనే కాల్పుల విరమణ చేపట్టాలని సూచించారు. సిరియాఅధ్యక్షుడు బషార్ అస్సద్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అమాయకుల ప్రాణాలను బలిగొంటుందని ఆమె ఆరోపించారు.