సిసి రోడ్డు పనులు ప్రారంభించిన ఎంపీపీ

 జనం సాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధు  ప్రత్యేక చొరవతో కమాన్ పూర్ మండల కేంద్రంలోని బాపూజీ నగర్ కి మంజూరైన ఐదు లక్షల సిసి రోడ్డు నిర్మాణ పనులకు శనివారం కమాన్ పూర్ మండల ఎంపీపీ రాచకొండ లక్ష్మి భూమి పూజ చేసి సీసీ రోడ్డు పనులను, స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులతో కలిసి  శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నీలం సరిత, బిఆర్ఎస్ పార్టీ కమాన్ పూర్ మండల అధ్యక్షులు పిన్ రెడ్డి కిషన్ రెడ్డి, కమాన్ పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మీమల్లు, కమాన్ పూర్ ఎంపీటీసీ 1 కోలేటి చంద్రశేఖర్, కమాన్ పూర్ ఉపసర్పంచ్ బొజ్జ రాజసాగర్, స్థానిక వార్డు సభ్యుడు గసిగంటి అజయ్,  నాయకులు రాచకొండ రవి, నీలం శ్రీనివాస్, కొట్టే భూమయ్య, ముప్పిడి బాలు, ఆకుల బాపు, తోట వీరయ్య, వెంగలి రాజయ్య గౌడ్, బోనాల సత్యం, గొడిశెల లింగ స్వామి,కమ్మగోని అనిల్, యాదగిరి వెంకటేష్, గొడిశెల స్వామి, చోక్కయ్య సజ్జనపు, రాధరపు సది లతోపాటు తదితరులు పాల్గొన్నారు.