సీఎం ఇందిరమ్మబాట పేరుతో రాజకీయ లబ్ది కోసం పాకులాడడం అన్యాయం

హైదరాబాద్‌: రాష్ట్రంలో జరుగుతున్న శిశుమరణాలపై సమీక్షించేందుకు తెదేపా నిజ నిర్ధరణ కమిటీ నిలోఫర్‌ ఆస్పత్రిలో పర్యటించింది. నీలోఫర్‌ ఆస్పత్రిలోనే ఏటా ఆరువేల మంది శిశువులు వైద్యం అందక చనిపోతుంటే ముఖ్యమంత్రి మాత్రం ఇందిరమ్మబాట పేరుతో రాజకీయ లబ్డి కోసం పాకులాడడం అన్యామని తెదేపా నాయకుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు ఆరోపించారు. ఆరోగ్యశ్రీ పేరుతో వందల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం సర్కారీ ఆస్పత్రిల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో మాత్రం విఫలమవుతోందన్నారు.