సీఎం నిర్ణయాన్ని వ్యతిరేఖించిన మంత్రి దానం నాగేందర్‌

హైదరాబాద్‌: కృష్ణ డెల్టాకు నాగార్జున సాగర్‌ నుంచి నీళ్ళు కృష్ణ జలాలను విడుదల చేయాలనే ముఖ్యమంత్రి నిర్ణయానికి తెలంగాణ ప్రాంత నేతలనుంచి వ్యతిరేఖత పేరుగుతుంది. ఇటివల్ల కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పాల్వాయి కూడా వ్యతిరేఖించాడు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన మంత్రి దానం నాగేందర్‌ వ్యతిరేఖించారు. నాగార్జున సాగర్‌లో డెడ్‌ స్టోరేజి ఉండగా కృష్ణ డెల్టాకు నీటిని విడుదల చేయటం సరైందికాదని హైదరాబాద్‌లో   తీవ్ర నీటి ఎద్దటి ఏర్పాడే అవకాశం ఉందని అందువల్లన వెంటనె నీటిని ఆపాలని అన్నారు. నీటి విడుదల సబబేనని జానారెడ్డి లాంటి వాల్లు మాట్లాడటం సరికాదని అన్నారు. మెడికల్‌ సీట్లలో రాజధానిలో అన్యాయం జరిగిందని ఒక వర్గానికి చెందిన వారికే సీట్లు కేటాయించారని హైదరాబాద్‌కు అన్యాయం జరిగితే సహించేదిలేదని మా వాణిని బలంగా వినిపిస్తామని ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతు అన్నారు.