సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామంలో జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్క 28,000 రూపాయల విలువైన చెక్కును లబ్ధిదారు బొడ్డు కీర్తన అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చెన్నవెన సదానందం, మండల పార్టీ అధ్యక్షులు శంకర్ గౌడ్ , జడ్పీటీసీ సుమలత శంకర్ లాల్, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీను ,ఎంపీటీసీ చైతన్య ప్రభాకర్ రెడ్డి, మండల నాయకులు అక్కపాక సంపత్, సింగిల్ విండో డైరెక్టర్ కిషన్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఉడుత లింగయ్య, మండల్ పార్టీ ఉపాధ్యక్షులు గొర్రె రమేష్ , మంథని లక్ష్మణ్, గ్రామ ఉప సర్పంచ్ బండి మహేష్, యూత్ అధ్యక్షులు సిద్ది రవికృష్ణ, సీనియర్ నాయకులు బొడ్డు సదానందం, మంథని కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.