సీతారాముల కళ్యాణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన శిశుమందిర్ విద్యార్థులు.
సీతారాముల కళ్యాణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన శిశుమందిర్ విద్యార్థులు.నాగర్ కర్నూల్ బ్యూరో, జనంసాక్షి:శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకు ని గురువారం నాగర్ కర్నూల్ పట్టణంలోని శ్రీ సీతారామస్వామి దేవాలయం నందు జరిగిన రాములవారి కల్యాణంలో ప్రత్యేక శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.శ్రీ రామ సీత లక్ష్మణ హనుమంతుని వేషధారణలతో రామాయణంలోని కొన్ని ఘట్టాలను మరియు అద్భుతమైన శ్లోకాలను ఆలపిస్తూ నేటి కాలానికి శ్రీరామచంద్రుడు ఏ విధంగా ఆదర్శ పురుషుడు విద్యార్థుల చేత ఏకపాత్రాభినయం చేయించడం జరిగింది. అలాగే హనుమంతుని మాటలలో నేటి సమాజ పోకడలను రామరాజ్యము యొక్క అవసరాన్ని హనుమంతుని యొక్క భక్తిని రామలక్ష్మణుల యొక్క అన్నదమ్ముల వాత్సల్యాన్ని సీతమ్మ యొక్క త్యాగమయ జీవితాన్ని విద్యార్థుల చేత ఏకపాత్రాభినయం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలల జిల్లా అధ్యక్షులు శ్రీమాన్ శ్రీ మిడిదొడ్డి శివశంకర్ కార్యదర్శి శ్రీ మిడిదొడ్డి నాగరాజు ఉపనిధిస్తూ నేటి సమాజానికి శ్రీ సరస్వతి శిశు మందిరాల యొక్క అవసరం చాలా ఉందని విద్యార్థులలో విద్య మాత్రమే కాక మంచి నడవడి మంచి బుద్ధులు సంస్కృతి సాంప్రదాయాలను శిశు మందిరాలలో అద్భుతంగా నేర్పిస్తున్నారని నేటి సమాజానికి ఇవి మంచి మార్గదర్శనాన్ని చూయించగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు శ్రీ వాస రమేష్ బాబు కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ సహకార దర్శి ప్రవీణ్ కుమార్ రెడ్డి కోశాధికారి శేశి రెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రసన్న లక్ష్మి మాతాజీలు ప్రబంధ కారినీ సభ్యులు పాల్గొని ప్రసాద వితరణ చేస్తూ అందరినీ ఆకట్టుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాముని వేసే దారుణ లో చిరంజీవి ప్రీతం, సీత వేశదారణలో ఆరాధ్య, లక్ష్మణుడిగా అభ్యుదయ్, హనుమంతుని వేషధారణలు చిరంజీవి సాయి కుమార్ పాల్గొనడం జరిగింది.