సీతారామ చంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

 :శామీర్ పేట్, జనంసాక్షి :
మూడు చింతలపల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామంలో రాములగుట్టలో సీతారామచంద్ర స్వామి కల్యాణ వసంతోత్సవములు సందర్భంగా బుధవారం ఉదయం ప్రాతః కాల అర్చనలు, వేద పారాయణం, మాన్యుసూక్త శ్రీ సూక్త ,పురుష సూక్త, రుద్రసూక్త పూర్ణాహుతి, గణపతి పూజ, ప్రసాద వితరణ సాయంత్ర భజనలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
సర్పంచ్ సింగం ఆంజనేయులు, వార్డు సభ్యులు తోట పరమేష్, అప్పాల రామరాజు, వీరేశం గుప్తా, సింగం పవన్ కుమార్, మేర శ్రీశైలం, బండి జగన్నాధం, చెలం సత్తయ్య, హీరాలాల్, మంద స్వామి, కావలి శ్రీనివాస్, మంద రవి.దినేష్ తదితరులు పాల్గొన్నారు.
29ఎస్పీటీ -2: పూజలో పాల్గొన్న నిర్వాహకులు