సీబీఐ కోర్టు ఎదుట హాజరైన ఎల్వీ సుబ్రహ్మణ్యం

హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసులో ఐఏఎస్‌ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈరోజు సీబీఐ కోర్టు ఎదుట హాజరయ్యారు. రూ 25 వేల బాండు, వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని సీబీఐ కోర్టు ఆదేశించింది. విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేసింది.