సీమంధ్ర నేతలు ఢిల్లీ యాత్రను విరమించుకోవాలి : హరీష్‌రావు

హైదరాబాద్‌ : సీమాంధ్ర నేతలు ఢిల్లీ యాత్రను విరమించుకోవాలని..యాత్రలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేరని తెరాస ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. నీటి పంపకాలపై అనుమానాలు ఉంటే సీమాంధ్ర నేతలు నివృత్తి చేసుకోవాలని సూచించారు. తెలంగాణకు అడ్డుపడితే వూరుకునేది లేదని హెచ్చరించారు.