సుందిళ్ల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ఆర్.జీ

-1 జిఎం జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిల్ల గ్రామ స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని నూతనంగా నియమితులైన ఆర్.జి-1 జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ శనివారం దర్శించు కున్నారు. వారికి కమాన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి రాజలింగు, ఆలయ చైర్మన్ మారం సమ్మయ్య, అర్చకులు స్వాగతం పలికారు. దక్షిణముఖ స్వామివారికి జీ.ఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం మేనేజర్ మాట్లాడుతూ.. స్వామి వారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలంగాణ రాష్ట్రం లోని ప్రసిద్ధి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాలలో సుందిల్ల లక్ష్మీనరసింహస్వామి ఆలయం కూడా ఉంటుందని సింగరేణి సంస్థ మరింత అభివృద్ధి చెందాలని కార్మికులు సురక్షితంగా వారి విధులు నిర్వహించాలని కోరుకున్నానని తెలిపారు. మొదటిసారిగా ఆలయానికి విచ్చేసిన జనరల్ మేనేజర్ ని కమాన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి రాజలింగు శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్.జి అధికారుల బృందం గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.