సునామీ హెచ్చరికల ఉపసంహరణ

టోక్యో : భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశం ఉందన్న హెచ్చరికలను జపాను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. జపాన్‌లో ఈరోజు మధ్యాహ్నం 7.3 తీవ్రత గల భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. 2011 మార్చిలో పెనుభూకంపం, వెనువెంటనే వచ్చిన సునామీల వచ్చిందికానీ అదృష్టవశాత్తూ అది  కొద్దిపాటి తీవ్రతతోనే ఉండడంతో ప్రజలు, ప్రభుత్వం తేలిగ్గా వూపిరి పీల్చుకున్నారు. గత ఏడాది సంభవించిన పెనుభూకంపం, సునామీల కారణంగా దాదాపు 20 వేల మంది మృత్యువాత పడ్డారు. రెండిటిని మినహాయించి జపానులోని 50 న్యూక్లియర్‌  రియాక్టర్లను భద్రతా ప్రమాణాల సమీక్ష నిమిత్తం మూసివేశారు.