సుమన్‌ భౌతికకాయానికి సీఎం చంద్రబాబు నివాళులు

హైదరాబాద్‌: అనార్యోగంతో కన్నుమూసిన ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు సుమన్‌ భౌతికకాయానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో ఆయన పార్థవదేహం వద్ద పూలమాల ఉంచి అంజలి ఘటించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సామభూతిని తెలియజేశారుజ సీఎంతో పాటు మంత్రులు డీకే అరుణ, సబితా ఇంద్రారెడ్డి తదితరులు నివాళులు అర్పించారు.