సురేష్ సేవా సమితి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

అల్వాల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 18
అల్వాల్ సర్కిల్ పరిధిలోని సురేష్ సేవా సమితి ఆధ్వర్యంలో మచ్చ బొల్లారం డివిజన్ సెలెక్ట్ టాకీస్ దగ్గర 3 అక్టోబర్ 2022 జరుగు బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథిగా విచ్చేయాలని మల్కాజ్గిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ లకు ఆహ్వాన పత్రికను సురేష్ సేవ సమితి వ్యవస్థాపకులు నార్ల సురేష్ అందజేశారు. ఆదివారంఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల నుండి అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తున్నామని ఈ బతుకమ్మ సంబరాలకు బతుకమ్మతో విచ్చేసిన భక్తులకు పేర్లు లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి బహుమతులను మల్కాజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేతుల మీదగా అందజేయుచున్నామని ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తారని కోరుకుంటున్నాము.
Attachments area



