సెప్టెంబరు 1 నుంచి 10వ తేదీవరకు పలు ప్యాసింజర్లు రద్దు

హైదరాబాద్‌: ట్రాక్‌ మరమ్మతుల కారణంగా సెప్టెంబర్‌ 1నుంచి 10వ తేదీవరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్మ రైల్వే ప్రకటించింది. దీంతో సెప్టెంబరు 1,2,8,9 తేదీల్లో సాయంత్రం 5.25 కు బయలుదేరే విజయవాడ-కాకినాడ ప్యాసింజర్‌ను రద్దు చేశారు. సెప్టెంబర్‌ 2,3,9,10 తేదీల్లో ఉదయం 4.30కు బయలుదేరే విజయవాడ-రాజమండ్రి ప్యాసింజర్‌ను రద్దు చేశారు. సూళ్లూరుపేట-నెల్లూరు ప్యాసింజర్‌ను పాక్షికంగా రద్దుచేశరు. సెప్టెంబర్‌ 1నుంచి 10వరకు గూడురు-విజయవాడ, విజయవాడ-బిట్రగుంట ప్యాసింజర్లను రద్దు చేశారు.