సెప్టెంబర్‌ 1న రహదారుల దిగ్బందనం

గుంటూరు: కృష్ణా డెల్టా సమైస్యపై సెప్టెంబర్‌ 1న 4జిల్లాల్లో రహదారుల దిగ్బందనం చేయాలని రైతు కమిటీ నిర్ణయించింది. ఈ రోజు గుంటూర్‌లో జరిగిన అఖిలపక్ష రైతుల సమావేశంలో కృష్ణా డెల్టా సమస్యపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమాన్ని ఉదృతం చేయాలని కమిటీ తీర్మానించింది. ప్రభుత్వం సాగు, తాగు నీరు విడుదల చేయకపోతే సెప్టెంబరు 4నుంచి దీర్ఘకాలిక పోరాటాలు చేయనున్నట్లు కార్యాచరణ సమితి పేర్కోంది.