సెప్టెంబర్‌ 30న తెలంగాణ మార్చ్‌

ఆదిలాబాద్‌్‌, జూలై 18: ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సకల జనుల సమ్మెకు దీటుగా సెప్టెంబర్‌ 30న హైదరాబాద్‌లో తెలంగాణ మార్చ్‌ నిర్వహిస్తున్నట్లు రాజకీయ ఐకాస ఛైర్మన్‌ శాంసుదర్‌రావు తెలిపారు. ప్రజా సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు కార్యచరణ రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. ఐకాస పున నిర్మాణం కోసం గ్రామస్థాయి నుండి జిల్లాస్థాయి వరకు కమిటీలు వేసేందుకు ఈ నెల 21న మంచిర్యాలలో సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.సింగరేణి యామాజన్యం ఏడాదికి ప్రైవేట్‌ కార్పొరేట్‌ ఆసుపత్రులకు 11 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని, ఇందుకు బదులు ప్రత్యేకంగా వైద్య కళాశాల ఏర్పాటు చేస్తే కార్మికులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. 927వ రోజుకు చేరుకున్న తెలంగాణ దీక్షలు ఆదిలాబాద్‌్‌, జూలై 18 (ఎపిఇఎంఎస్‌): ప్రత్యేక రాష్ట్రం కోసం ఆదిలాబాద్‌ చేపట్టిన తెలంగాణ రిలే దీక్షలు బుధవారంనాటికి 927వ రోజుకు చేరుకున్నాయి. ప్రజల ఆకాంక్ష మేరకు చేస్తున్న ఉద్యమంలో అందరూ ఐక్యంగా పాల్గొనాలని ఐకాస నేతలు పిలుపునిచ్చారు. స్వయం పాలన కోసం, తెలంగాణ ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని కేంద్రం వెంటనే ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రం సాధించేంతవరకు అవసరమైతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు.