సైనా, గోపిచంద్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపిన సచిన్‌

హైదరాబాద్‌: లండన్‌ ఒలంపిక్స్‌లో పతకాలు సాదించిన భారత క్రీడాకారులందరికీ భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణలో ఒలంపిక్స్‌ పతకం సాదించిన రాష్ట్ర బ్యాట్మింటన్‌ క్రీడాకారిణి సైనానెహ్వాల్‌కు అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సచిన్‌ మాట్లాడుతూ సైనా, గోపిచంద్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.