సోనియాను కలిసిన జానా, కోమటిరెడ్డి

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీని మంత్రి జానారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కలిశారు. తెలంగాణపై అనుకూల నిర్ణయం తీసుకోవాలని వారు సోనియాకు విన్నవించినట్లు సమాచారం. సోనియాతో వారి భేటీకీ ప్రాధాన్యత సంతరించుకుంది. సోనియాను కలిసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడలేదని సమాచారం.