సోనియా, ప్రధానితో బహిరంగ చర్చకు సిద్ధం : కేజ్రీవాల్‌

న్యూ ఢిల్లీ,అక్టోబర్‌ 21 (జనంసాక్షి):
కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా, ఆమె కుమారుడు రాహుల్‌గాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌లు అవినీతి ఆరోపణల నుంచి బైటపడి పరిశుద్దులుగా ముద్ర వేయించుకుంటే తమ సంస్థ ఐతమ సంస్థ ఇండియా అగైనిస్ట్‌ కరప్షన్‌పై వచ్చిన అవినీతి
ఆరోపణలకు సమాధానం చెబుతామని సంస్థ క్రియా శీలక సభ్యుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం అన్నారు. శనివారం కేజ్రీవాల్‌పై ఆయన సంస్థపైన ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి పలు ప్రశ్నలను సంధించారు. కాని ప్రధాని తదితరులు ప్రజలు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన తర్వాత కాంగ్రెస్‌ తనపై చేస్తున్న ఆరోపణలకు సమాధానమిస్తానని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. వాద్రాపైన ప్రధానిపైన కొన్ని ఆరోపణలు చేశాం. ముందు వాటికి వారిని సమాధానం ఇవ్వమనండి తర్వాత దిగ్విజయ్‌ ప్రశ్నలకు సమాధానమి స్తామన్నారు. సోనియాను ఆమె కుటింబీకులను ప్రశ్నించే ధైర్యం ద్విగిజయ్‌కు ఉందా అని అరవింద్‌ సవాల్‌ చేశాడు. వ్యక్తిగత, ప్రజల సమస్యలపైన ఒకరినోకరు ప్రశ్నించుకొవచ్చు కాని దిగ్విజయ్‌ సిద్ధంగా ఉన్నారా.? తన పార్టీ అధినేతలను ప్రశ్నించే ధైర్యం ఆయనకు లేకుంటే కేవలం చవకబారు ప్రచారం కోసమే మాపై ఆయన విరుచుకుప డుతున్నాట్లు అనుమానించాల్సిన అవసరముందన్నారు.