స్టడీ టూర్ లో వరంగల్ వ్యవసాయ మార్కెట్ పాలకవర్గంస్టడీ

 

టూర్ లో వరంగల్ వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం

వరంగల్ ఈస్ట్ 21 (జనం సాక్షి)

వ్యవసాయ మార్కెట్ కమిటీ వరంగల్ పాలకవర్గం స్టడీ టూర్ లో భాగంగా వైస్ చైర్మన్  ఆధ్వర్యంలో నిజామాబాద్ మార్కెట్  రెగ్యులేషన్ పద్ధతులను మరియు మార్కెట్ నందు ఈనామ్ అమలు తీరును  మంగళవారం  రోజున పరిశీలించడం జరిగినది. తదుపరి మార్కెట్ కార్యదర్శి ని కలసి మార్కెట్ నందు  కొనుగోళ్లు గురించి తెలుసుకోవడం జరిగినది. ఇట్టి మార్కెట్ నందు రైతులు తీసుకువచ్చే పసుపు, సోయా మరియు ఇతర వ్యవసాయ ఉత్పత్తులు అన్ని కూడా పూర్తిగా ఈనామ్ ద్వారా క్రయవిక్రయాలు జరుగుతున్నాయని పరిశిలించనైనది.
ఇట్టి కార్యక్రమంలో వైస్ చైర్మన్ కాలేరు కరంచంద్, కమిటీ సభ్యులు  గోలి రాజయ్య,  పసునూరి సారంగపాణి,  తుమ్మ రవీందర్ రెడ్డి,  పట్టాపురం ఏకాంతం గౌడ్,  పల్లెపాటి శాంతిరథన్  రావు,  పిన్నింటి వెంకట్ రావు,  బి. వి. రాహుల్ ఉన్నత శ్రేణి కార్యదర్శి,  టీ. చందర్ రావు కార్యదర్శి గ్రేడ్ -2  పాల్గొన్నారు.