స్థాయిసంఘాల ఏర్పాటుకు ప్రయత్నాలు వేగవంతం

హైదరాబాద్‌: రాష్ట్రంలోనూ పార్లమెంటు తరహా స్థాయి సంఘాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా   శాసనసభ, మండలి నిబంధనల కమిటీలు సమావేశమయ్యాయి. శాసనసభ కమిటీ హాలులో జరుగుతున్న ఈ సమావేశానికి ఛైర్మన్‌ చక్రపనాణి, సభాపతి మనోహర్‌, మంత్రులు  ఆనం, శ్రీధర్‌బాబు, మండలి విపక్ష నేత దాడి వీరభద్రరావు, సభ్యులు రావుల, కేసీఆర్‌ తదితరులు హాజరయ్యారు. స్థాయి సంఘాలకు సంబంధించి సమావేశంలో చర్చిస్తారు. సంఘాల ఏర్పాలు, విధి విధానాలు, పాకలమెంటు అమలు తీరుపై సమావేశంలో చర్చించనున్నారు.