స్పీకర్ స్థానానికి వన్నె తెస్తా : కోడెల శివప్రసాద్
హైదరాబాద్, (మార్చి20): నాకంటే ముందు ఎంతోమంది మహనీయులు స్పీకర్ స్థానంలో పని చేశారు.స్పీకర్లుగా హుందాగా వ్యవహరించి ఆ స్థానానికే గౌరవం తీసుకు వచ్చారని స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. తాను కూడా వారి బాటలోనే నడిచి ఆ పదవికి వన్నె తెస్తానని ఆయన చెప్పారు. స్పీకర్‌ను అవమానించేలా ప్రవర్తించిన వైసీపీ సభ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాని, సభా సంప్రదాయాల మేరకే తాను వ్యవ హరిస్తానని ఆయన స్పష్టం చేశారు.