స్పేస్‌వాక్‌ పూర్తిచేసిన సునీతా

హ్యూస్టన్‌: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎన్‌) కు వెలుపల కొత్త పవర్‌ స్విచ్చింగ్‌ యూనిట్‌ను అమర్చేందుకు భారత-అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ జపాన్‌ వ్యోమగామి అకిహికో హిషోడె కలసి నిర్వహించిన స్పేస్‌వాక్‌ ఫలితాన్ని ఇవ్వలేదు. వీరిద్దరూ వంద కిలోల బరువున్న మెయిన్‌ బన్‌ స్విచ్చింగ్‌ యూనిట్‌ (ఎంబీఎస్‌యూ)ను ఐఎస్‌ఎన్‌కు చెందిన ఎస్‌-జీరో ట్రన్‌కు అమర్చడంలో విఫలమయ్యారని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) పేర్కొంది. సునీతా విలియమ్స్‌ (46)కు ఇది ఐదో స్పేస్‌వాక్‌. అకిహికో, రష్యాకు చెందిన యూరి మాలెన్‌చెంకోతో కలసి సునీత జులై 15న సోయజ్‌ వ్యోవనౌక ద్వారా అంతరిక్షంలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. సుదీర్ఘకాలం పాటు అంతరిక్షంలో గడిపిన మహిళా వ్బోగామిగా ఆమె రికార్డు సృష్టించారు.