స్వదేశనికి చేరుకన్న అంగ్‌సాస్‌ సూకీ

యాంగాన్‌: మయన్మార్‌ ప్రతిపక్షనేత అంగ్‌సాస్‌ సూకీ రెండు వారాల యూరోపు పర్యటన ముగించుకుని ఈ రోజు స్వదేశం చేరుకున్నారు. శనివారం ఉదయం  యాంగాస్‌ విమానాశ్రయానికి చేరుకున్నా సూకీకి స్వాగతం చెప్పడానికి వచ్చిన అభిమానులతో ఆ ప్రాంతమంతా జనసంద్రమైంది. రెండు దశాబ్దాల తర్వాత దేశం వీడి విదేశీ పర్యటనకు వెళ్లిన సూకీకి ప్రతిచోటా ఓ దేశాధినేతకు లభించే గౌరవ సత్కారాలు లభించాయి. ఈ పర్యటనలోనే ఆమె 21 ఏళ్ల తర్వాత నోబెల్‌ బహుమతి స్వీకార ఉపన్యాసం ఇచ్చారు.