హజ్ యాత్రికులకు ఘన సన్మానం…

నాగర్ కర్నూల్ ఆర్సీ మే 31(జనంసాక్షి):నాగర్ కర్నూల్ జిల్లా నుండి హజ్ యాత్రకు వెళుతున్న భక్తులను బుధవారం జామియా మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.జామే మస్జిద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ ఖాదర్ హజ్ యాత్రికులను శాలువలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం తో పాటు నాతియా ప్రోగ్రాం నిర్వహించారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ,నాగర్ కర్నూల్ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని,హిందుస్థాన్ శాంతి సౌభ్రాతృత్వాలతో సుఖశాంతులతో పాడిపంటలతో మరింత అభివృద్ధి చెందాలని అల్లాతో ప్రార్థించాలని హజ్ యాత్రకు వెళ్తున్న భక్తులకు కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా హజ్ సొసైటీ అధ్యక్షుడు షేక్ ఫరీద్ అహ్మద్,ముస్లిం అడ్వైజరీ కమిటీ ఉపాధ్యక్షుడు షేఖ్ యాకూబ్ బావాజీర్,మహమ్మద్ సాదిక్ పాషా రక్షబంది,మహమ్మద్ ఇబ్రహీం నక్షబంది,మహమ్మద్ ఖజా బాబా,మహమ్మద్ నజీమ్,మహమ్మద్ మోయిను ఇతరులు పాల్గొన్నారు.