హనుమాపురం యూపీ స్కూల్‌ హెచ్‌ఎంపై కేసు నమోదు

వినుకొండ : గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం హనుమాపూరం యూపీ స్కూల్‌ ప్రధానోపాధ్యాయులు మాస్‌సింగ్‌ నాయక్‌పై బండ్లమోటు పోలీస్‌స్టేషన్లో కేసు నమోదైంది. పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి కేటాయించిన నిధులను స్వాహా చేశారని అరోపిస్తూ ఎంఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాఠశాలకు కేటాయించిన అదనపు తరగతి గదుల నిర్మాణంలో రూ. 8 లక్షలు, జాతీయ బాలిక ప్రయోజన పథకం కింద విడుదలైన రూ. 2 లక్షలు నిధులు స్వాహా చేశారని మండల విద్యాశాఖాధికారి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంఈవో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.