హబ్సిగూడలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌:హబ్సిగూడ ప్రధాన రహదారిలోని ఓ అపార్ట్‌మెంట్‌ లో ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భూపతి అపార్ట్‌మెంట్‌ మూడో అంతస్తులో మంటలు చెలరేగి ఎగసిపడుతున్నాయి. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకురావడానికి యత్నిస్తున్నారు.