హరితహారంలో ప్రజలందరూ పాల్గొనాలి: స్పీకర్

harithaharam19హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని శాసన సభాపతి మధుసూదనాచారి అన్నారు. శాసనసభ, శాసనమండలి తో పాటు నగరంలోని ఓల్డ్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నేడు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో సభాపతి మధుసూదనాచారి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, ఉప సభాపతి పద్మాదేవేందర్‌రెడ్డిలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. మొక్కలు నాటిన అనంతరం పలువురు మాట్లాడుతూ…

సీఎం కేసీఆర్ వెయ్యి సంవత్సరాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. కులమతాలకతీతంగా హరితహారంలో అందరూ పాల్గొని మొక్కలను నాటాలి. పచ్చని చెట్లు జీవరాశి మనుగడకు ఆయువుపట్టు. పూర్వీకులు ఈ సూకా్ష్మన్ని గ్రహించి వనాలను ప్రేమించారు. భూమి మనుగడ కొనసాగించాలంటే అడవులను ప్రేమించాలి. మూడు తరాలుగా అడవులు, విధ్వంసానికి గురయ్యాయి. వాతావరణ సమతుల్యత కాపాడేందుకు హరితహారం ఉపయోగపడుతుంది. ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ హరితహారం అమలు చేస్తున్నరని పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.