హార్డ్‌వేర్ పాలసీపై మాట్లాడిన పొన్నాల
హైదరాబాద్: హార్డ్‌వేర్ ఆధారిత పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రశుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని ఐటీశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. హార్డ్‌వేర్ సంస్థలు ఏటా 6 వేల కోట్ల టర్నోవర్ సాధిస్తూన్నాయని ఆయన వివరించారు. హైదరాబాద్‌లో ఓ మొబైల్ ఫోన్ ఆవిష్కరణోత్సవానికి విచ్చేసిన పొన్నాల హార్డ్‌వేద్ పాలసీపై మాట్లాడారు. నూతనంగా హార్డ్‌వేర్ కంపెనీలను ఏర్పాలు చేసే వారికి ప్రోత్సహిస్తూనే ఇప్పటికే కార్యాకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలకూ 10 నుంచి 25 శాతం వరకు రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.