హింసాత్మకంగా ‘కరాచీలో’ ర్యాలీ ఒకరి మృతి

కరాచీ : అమెరికా చిత్రానికి వ్యతిరేకంగా పాక్‌లోని కరాచీ నగరంలో నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారడంతో ఒకరు చనిపోయారు. అమెరికా రాయబార కార్యాలయంలో లోపలికి దూసుకువేళ్లేందుకు ఆందోళనకారులు చేసిన ప్రయత్నలను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక ప్రదర్శనకారుడు ప్రాణాలు కోల్పోయాడు.