హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన సినీ హీరో కృష్ణుడు
హైదరాబద్: తన స్థలాన్ని కబ్టాచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సినీ హీరో కృష్ణుడు రాష్ట్ర మానవ హక్కుల కమీషన్‌ను ఆశ్రయిచారు. హైదరాబాదు శివారు మణికొండ హనుమాన్ నగర్ కాలనీలో రూ.60 కోట్లు విలువ చేసే తన భూమిని కొందరు స్థానిక నేతలు రాజకీయ అండతో ఆక్రమించాలని చూస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. కబ్జాకు ప్రధాన సూత్రధారులైన ఎల్లారెడ్డి, సాయిరెడ్డిలు తనను బెదిరిస్తున్నారన్నారు. దీనికి స్పందించి కమిషన్ 21 వ తేదీలోగా సమగ్రనివేదిక ఇవ్వాలని రంగారెడ్డి కలెక్టర్ సైబరాబాద్ కమిషనర్‌లను ఆదేశించింది.