హైకోర్టు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం

హైదరాబాద్‌: రాష్ట్రపతి సిఫార్సుల మేరకు బార్‌ అసోషియేషన్‌కు చెందిన ఇద్దరు సీనియర్‌ న్యాయవాదులు రాష్ట్ర హైకోర్టు నాయ్యమూర్తులుగా ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టులో సీనియర్‌ న్యాయవాదులుగా పని చేసిన ఎం.ఎన్‌.రామచంద్రరావు, సి.ప్రవీణ్‌కుమార్‌ల చేత తాత్కలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ పి.సి. ఘోష్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఎంపానల్‌ కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి వీరిద్దర్ని హైకోర్టు న్యాయమూర్తులుగా ఎంపిక చేశారు. ఈ మేరకు జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ ఎం.ఎన్‌. రామచంద్రరావులు బాధ్యతలు చేపట్టారు.