హైదరాబాద్‌లో ‘పాడి పరిశ్రమ’ సదస్సు

హైదరాబాద్‌: ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు నగరంలోని హైటెక్స్‌లో పాడి పరిశ్రమ ప్రదర్శన (బ డెయిరీ షో-2012)ను నిర్వహించనున్నారు. పశుషోషణ, పాడి పరిశ్రమకు సంబంధించి ఇప్పటి వరకు జరగని అద్భుత ప్రదర్శన అని నిర్వాహకులు చెబుతున్నారు. ఈప్రదర్శనలో 15 జాతులకు చెందిన పశువులను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రి విశ్వరూప్‌ ఈ సదస్సును ప్రారంభించనున్నారు.