హైదరాబాద్‌లో బైక్‌ ర్యాలీ

హైదరాబాద్‌: రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో రవాణా, ట్రాఫిక్‌ శాఖల ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కంట్రోల్‌ రూం వద్ద రవాణాశాఖ కమిషనర్‌ సంజయ్‌కుమార్‌ వాహనాల ర్యాలీ ప్రారంభించారు. రోడ్డుపై జరుగుతున్న ప్రమాదాలు ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ నిబంధనలు, హెల్మెట్‌  ధరించడం వంటి వాటిపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు బైక్‌ ర్యాలీ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇంటి నుంచి బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులను గుర్తుంచుకుని నడుచుకోవాలని సూచించారు.

తాజావార్తలు